హైదరాబాద్ చరిత్రలోనే భారీ భూ కబ్జా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఫోర్జరీ పత్రాలతో రూ. 300 కోట్ల విలువైన స్థలం ఆక్రమణ చేయడం సంచలనం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని నాలుగున్నర ఎకరాల స్టలం విషయంలో వివాదం నెలకొంది. కొనుక్కున్నది 2.21 గుంటలు.. నకిలీ పత్రాలతో 7 ఎకరాల స్థలం కొన్నట్లు డాక్యూమెంట్స్ సృష్టించారు.
పక్కనున్న స్థలం కూడా తమదే అంటూ జీ హెచ్ ఎమ్ సి వద్ద నుంచి భవన నిర్మాణ అనుమతులు కుద తీసుకున్నారు. నిర్మాణ సంస్థలు ఫోర్జరీ పత్రాలు సృష్టించాయంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసారు బాధితులు శ్రీధర్, ప్రసాద్. నజీబ్ అహ్మద్ అనే వ్యక్తీతో పాటు ఆయా సంస్థలపై కేసులు నమోదు చేసారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ ఘటనపై ప్రభుత్వం ఆరా తీసింది.