ఎమ్మెల్యే టికెట్ కావాలన్న వ్యక్తి.. సోనుసూద్ రిప్లై ఏంటో తెలుసా..!

ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో ఆపద్బాంధవుడిగా మారిపోయి సహాయం కావాలి అన్న వారికి సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు సూను సూద్. ముఖ్యంగా వలస కార్మికులకు సోనూసూద్ చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ తర్వాత కూడా తన పెద్ద మనసు చాటుకుంటూ ఎంతోమంది నిరుపేదలకు చేయూతనిస్తూ సహాయం చేస్తున్నారు. కాగా ఎంతోమంది సోషల్ మీడియా వేదిక సోనూసూద్ ని సహాయం కావాలంటూ కోరుతున్న విషయం తెలిసిందే.

ఇటీవలే ఓ వ్యక్తి కూడా ఇలాగే సహాయం కావాలని కోరాడు. కానీ ఆ వ్యక్తి వింత సహాయం కోరాడు. బీహార్ కు చెందిన ఓ వ్యక్తి బిజెపి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తనకు టిక్కెట్ ఇప్పించాలి అంటూ సోను సూద్ ని కోరాడు. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో భగల్పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నానని తెలిపిన సదరు వ్యక్తి.. ఎన్నికల్లో గెలిచాక ప్రజలకు సేవ చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని.. దయచేసి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించండి సార్ అంటూ అడగాడు. దీనికి రిప్లై ఇచ్చిన సోనూ తనకు బస్సు రైలు విమాన టిక్కెట్లు బుక్ చేయడం తప్ప ఇతర టిక్కెట్లు బుక్ చేయడం తెలియదు అంటూ సమాధానమిచ్చాడు.