BREAKING : పేదలకు శుభవార్త..భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు

-

సామాన్యులకు ఆయిల్‌ కంపెనీలు కాస్త ఊరట కలిగించాయి.  దేశీయ చమురు కంపెనీలు, కమర్షియల్ సిలిండర్ ధరను మరోసారి తగ్గించాయి. హైదరాబాద్ లో 19 కేజీల ఎల్పిజి కమర్షియల్ సిలిండర్ ధర రూ. 36.5 తగ్గింది. తాజా తగ్గింపుతో హైదరాబాద్ లో సిలిండర్ రూ. 2099.5 నుంచి రూ. 2063 గా ఉంది.

విజయవాడలో రూ. 2035.5, విశాఖపట్నంలో రూ. 1908.5 కి చేరింది. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గించడం వరుసగా ఇది ఆరోసారి. 14.2కేజీల గృహ వినియోగ సిలిండర్ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

కాగా.. విద్యుదుత్పత్తి, ఎరువుల తయారీకి వినియోగించే నేచురల్ గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం 40% మేర పెంచింది. నేటి నుంచి 6 నెలల పాటు ఈ ధరలు అమల్లో ఉంటాయని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (PPAC) వెల్లడించింది. CNG వాహనాల్లో, ఇళ్లల్లో వంట కోసం వినియోగించే పైపులైను గ్యాస్ గాను సహజవాయువును వినియోగిస్తారు. ధరల పెంపుతో CNG నీ వినియోగించే వాహనదారులపై తీవ్ర ప్రభావం పడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news