బిగ్ బాస్: అర్జున్ కొంపముంచిన శ్రీ సత్య..చివరికి జైలు పాలు..!!

-

ప్రస్తుతం బిగ్ బాస్ ఇస్తున్న విచిత్రమైన టాస్కులు.. వాటికోసం హౌస్ మేట్స్ పడుతున్న తంటాలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పాలి. ఇక ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో ముగ్గురు కెప్టెన్సీ అయ్యారు. మొదటి వారం బాలాదిత్య , రెండవ వారం రాజశేఖర్ , మూడవ వారం ఆదిరెడ్డి కెప్టెన్ అయ్యారు. ఇక నాలుగవ వారం కెప్టెన్ గా కీర్తి బట్ ఎంపికయింది. ఇక ఈ సీజన్లో తొలి మహిళా కెప్టెన్ అయిన కీర్తి కెప్టెన్ సింహాసనంపై కూర్చుంది. దీంతో అందరికీ స్ఫూర్తి.. మా కెప్టెన్ కీర్తి అని స్లోగన్స్ కూడా చేశారు హౌస్ మేట్స్.. అయితే మరోపక్క కెప్టెన్సీ టాస్క్ లో ఓడిపోయిన శ్రీ సత్య ఒక దగ్గర కూర్చోగా అర్జున్ అక్కడికి వెళ్లి ఆమె కాళ్ళు నొక్కుతూ కనిపించాడు.

ఈ వారం వరస్ట్ కంటెస్టెంట్ ఎవరో తేల్చుకోమని బిగ్ బాస్ చెప్పగా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నామినేట్ చేశారు. కాగా వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎక్కువ ఓట్లు పడిన అర్జున్ కళ్యాణ్ చివరికి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.. ఇక అర్జున్ జైలుకు వెళ్లడానికి కారణం నేనే అంటూ శ్రీ సత్య చెప్పుకొచ్చింది. నా వల్ల ఇతనికి ఎక్కువ ఓట్లు పడ్డాయి ఇక నాకు సపోర్ట్ చేయడు అని కూడా తెలిపింది. మొత్తానికి అయితే శ్రీ సత్య వల్ల అర్జున్ జైలు పాలయ్యారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే డేంజర్ జోన్ లో ఆరోహి, అర్జున్, సుదీప, రాజశేఖర్, సూర్య వంటి వారు ఉండగా వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం ప్రస్తుతం ఉత్కంఠను రేపింది. కానీ ఈ వారం ఊహించని విధంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా రాజశేఖర్ ను ఎలిమినేట్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news