మానవ పుర్రెలను ఆహార పాత్రలుగా వాడతారు.. ఆవులను, మేకలను దూరం పెడతారు.. అఘోరాల గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

-

అఘోరాలు చూడడానికి భయంకరంగా ఉంటారు. అఘోరాల ఆకృతి వింతగా ఉంటుంది. పైగా చేతి లో కపాలం… ఒళ్లంతా విభూతి ఇవన్నీ చూస్తే కాస్త భయం వేస్తుంది. అయితే అఘోరాలకి సంబంధించి ముఖ్య విషయాలు చాలా మందికి తెలియదు. అఘోరాలు మనకి ఎక్కువగా కాశీ లో కనబడుతూ ఉంటారు. అలానే కుంభమేళా వంటి వాటిల్లో అఘోరాలు కనపడుతూ ఉంటారు. అయితే అఘోరాలకి సంబంధించి కొన్ని విషయాలు చూద్దాం.

అఘోరాలు పచ్చి మానవ మాంసాన్ని తింటారు. స్మశాన వాటికలో వీళ్ళు నివసిస్తూ ఉంటారు. మృతదేహాలను తీసుకుని తింటూ ఉంటారు. సగం కాలిన తర్వాత వాళ్ళు బయటకి తీసి వాటిని తింటూ ఉంటారు. అలానే శరీర ద్రవాలను కూడా తాగుతూ ఉంటారట.

అలానే మృతదేహాలతో శారీరక సంబంధం పెట్టుకుంటారట వీళ్ళు. శివుడు ఐదు రూపాలలో అఘోర కూడా ఒకటి. శివుడిని పూజించడానికి అఘోరాలు మృతదేహం మీద కూర్చుని సాధన చేస్తారు. అయితే మృతదేహం నుండి శివుడిని పొందడం అఘోర సంస్కారానికి సంకేతమట. అలానే అఘోరాల బ్రహ్మచర్యం పాటించరు.

భౌతిక సంబంధాన్ని పెట్టుకుంటారు. అలానే మానవ పుర్రెలను ఆహార పాత్రలుగా వాడతారు. అఘోరీలు కి కుక్కలు అంటే ఎంతో ఇష్టం. ఆవు మేక వంటి ఇతర జంతువులకు దూరంగా ఉంటారు కానీ కుక్కలు అంటే వీళ్ళకి చాలా ఇష్టమట. అయితే అఘోరాలు మరో విషయాన్ని నమ్ముతారు అదేమిటంటే ప్రతి వ్యక్తి అఘోరిగా జన్మిస్తారని వీళ్ళ నమ్మకం వీళ్ళు మురికిని మంచితనాన్ని కూడా ఒకేలా చూస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news