Breaking: బండి భగీరధ్ ను సస్పెండ్ చేసిన మహీంద్రా యాజమాన్యం..

-

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌క చెందిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. అయితే.. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైదరాబాద్లోని మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్న విషయం తెలిసిందే. బండి భగీరథ్ తన జూనియర్ విద్యార్థిని బండ బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్టు కొడుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఆ వీడియో పాత వీడియో అని, ఆ వీడియోలో బాధితుడుగా ఉన్న విద్యార్థి బండి భగీరథ్ కు ప్రస్తుత మంచి స్నేహితుడని క్లారిటీ కూడా వచ్చింది. ఇదిలా ఉండగానే బండి భగీరథ్ కు కు సంబంధించిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరొక విద్యార్థిని తన గ్రూప్ సభ్యులతో కలిసి వెళ్లి బండి భగీరథ్ అసభ్య పదజాలంతో దూషిస్తూ ఇష్టం వచ్చినట్టు కొడుతున్న మరొక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం బండి భగీరథ్ పై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది.

పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో పాటుగా, భగీరథ్ పై వేటు వేసింది. భగీరథను కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు బండి భగీరథ్ పై ఐపీసీ సెక్షన్లు 341, 323,, 504, 506, 34 కింద కేసులు నమోదు చేశారు. ఇక బండి భగీరథ్ కు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన తొలి వీడియోకు సంబంధించి, బాధితుడు తాను తప్పు చేయడం వల్లే, బండి భగీరథ్ అలా కొట్టాడని, అందులో భగీరథ్ తప్పేమీ లేదని వీడియో సందేశాన్ని పంపి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ వివాదం సమసిపోతుంది అనుకున్న క్రమంలో మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇప్పుడు బండి భగీరథ్ ఎలాంటి వాడు అన్న చర్చకు కారణంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news