భార్యా, భర్తలు అంటే ఇలా ఉండాలి, అసలు మగాడంటే ఇతడే, ఇలాంటి మగాడు భర్తగా రావాలి అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలు అందరూ ఓ భర్త తన భార్య కోసం చేసిన పని చూసి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. తనకోసం అన్నీ వదులుకుని వచ్చిన భార్య కోసం ఆ భర్త చేసిన ప్రయత్నం మా హృదయాలని తట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. చైనాలో జరిగిన ఈ ఘటన వివరాలోకి వెళ్తే..
చైనాలో ఓ భర్త గర్భిణి అయిన తన భార్యని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాడు. ఆ డాక్టర్ వద్దకు చాలా మంది రోగులు వచ్చి వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే అందరితో అక్కడి కుర్చీలు నిండిపోయాయి. నెలలు నిండిన ఆమె కూర్చోలేక ఇబ్బందులు పడుతున్నా సరే ఎవరూ స్పందిచడంలేదు. కనీసం ఒక్కరు కూడా లేచి ఆమెకి కుర్చీ ఇవ్వలేదు. దాంతో ఆమె తీవ్ర ఇబ్బందులకి గురవుతున్న క్రమంలో
ఆమె భాదని చూసి తట్టుకోలేని భర్త అక్కడే అందరి ముందు గోడకి దగ్గరగా కింద కూర్చున్నాడు. తన వీపుపై గర్భిణి అయిన భార్యని కూర్చో పెట్టుకుని అలాగే ఉండిపోయాడు. ఈ ఘటనని చుట్టుపక్కల ఉన్న వారు చూస్తున్నారు తప్ప అప్పటికి కూడా కుర్చీ ఇవ్వలేదు. ఈ వీడియోని స్థానికంగా ఉన్న పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.