భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం..

-

నిన్న స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర ఈ రోజు కూడా త‌గ్గుద‌ల న‌మోదు చేసింది. సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 190 రూపాయలు తగ్గి 39,530 రూపాయలకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 290 రూపాయలు తగ్గి 36,120 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర మార్పులేకుండా 47,500 వద్ద నిలిచింది.

ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 300 రూపాయలు తగ్గాయి. దీంతో 38,100 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 300 రూపాయలు తగ్గడంతో 36,900 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధరలో ఎలాంటి మార్పులేదు. దీంతో వెండి కేజీకి 47,500 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news