సంసారంలో కలహాలు సహజమే, అసలు కలహాలు లేకపోతేనే ఆ సంసారం బాగోలేదని అర్ధం. ఇలాంటి చిన్న గొడవలకు తట్టుకోలేక చావు వరకు తెచ్చుకుంటున్న భార్యాభర్తలు ఎంతోమంది ఉన్నారు. తాజాగా నాయుడుపేటకు చెందిన వ్యక్తి భార్య పుట్టింటి నుండి రాలేదని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం జువ్వలపాలెం కు చెందిన గోరావ్ వెంకటరమణయ్య (38) తన భార్యతో చిన్న గొడవ కావడంతో… అలిగిన భర్య పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఇది మాములే అనుకున్న భర్త కొన్ని రోజులు ఆమె కోసం వేచి చూశాడు. ఆ తర్వాత వెంకటరమణయ్య భార్య దగ్గరకు వెళ్లి రమ్మని పిలిచినా ఆమె రావడానికి ఇష్టపడలేదు.
దీనితో విసిగిపోయిన భర్త భార్య రాకుండా ఈ జీవితం ఎందుకని విరక్తి చెంది నిన్న మధ్యాహ్నం రెండు గంట్లకు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఇంటి సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై శ్రీకాంత్ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.