సినిమాలపై స్టే విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

-

సినిమాల ప్రదర్శనపై స్టే విధించడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీటిపై స్టే విధించే సమయంలో న్యాయస్థానాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొంది. ‘ద కేరళ స్టోరీ’ సినిమాకు సీబీఎఫ్‌సీ జారీ చేసిన ధ్రువపత్రాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరిస్తూ.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

‘‘నిర్మాత కోణంలో ఈ విషయాన్ని చూడండి. ఎన్నిసార్లు ఆయన సవాళ్లు ఎదుర్కొవాలి? అంతిమంగా ఎవరో ఒకరు డబ్బులు పెట్టుబడిగా పెడతారు. ఎంతో శ్రమపడి నటులు అంకిత భావంతో నటిస్తారు. కాబట్టి సినిమాల విడుదలపై స్టే విధించడంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సినిమా సరిగా లేకపోతే ఆ విషయాన్ని మార్కెట్‌ నిర్ణయిస్తుంది’’ అని సుప్రీం కోర్టు పేర్కొంది.

కేరళలో వేల సంఖ్యలో హిందూ యువతులను బలవంతంగా ముస్లిం మతంలోకి చేర్చినట్లు.. వారిని ఐసిస్‌ ఉగ్రముఠా ఉపయోగించుకున్నట్లు ట్రైలర్‌లో చూపడంతో ‘ద కేరళ స్టోరీ’ సినిమా వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news