ఫస్ట్ నైట్ కోసం ఎదురుచూస్తున్న భర్త..ఒక్క మాటతో షాక్..చివరికి..

-

పెళ్ళికి ముందు ఎన్నో రాత్రులు గడపడం వేరు..పెళ్ళి తర్వాత మొదటి రాత్రిని గడపడం వేరు.. కానీ ఈరోజుల్లో పెళ్ళికి ముందే వేరొకరితో సంబంధం పెట్టుకోనే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. ఇకపోతే ఇప్పుడు సినిమా లెవల్ ఘటన వెలుగు చూసింది.అమ్మాయిని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. ఫస్ట్ నైట్ కోసం ఆత్రుతగా ఎదురుచూసిన అతడికి.. వధువు శారీరిక సంబంధానికి నిరాకరించింది. పెళ్లి పనుల్లో అలిసిపోయి ఉండొచ్చులే అని అనుకున్నాడు.

ఇక రెండో రోజు కూడా అదే వరస.. ఆమె అతడ్ని దగ్గరకు రానివ్వకపోవడంతో.. భర్తకు డౌట్ వచ్చి గట్టిగా నిలదీశాడు. అంతే అతడికి దిమ్మతిరిగే షాకిచ్చింది భార్య. తానొక ట్రాన్స్‌జెండర్ అని చెప్పడంతో.. వరుడుతో సహా అత్తమామలు దెబ్బకు నిర్ఘాంతపోయారు. చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..ఈటాలోని జైతారా గ్రామానికి చెందిన ఓ యువకుడు.. ఇటీవల ఢిల్లీకి చెందిన అమ్మాయిని వివాహమాడాడు.

ఫస్ట్ నైట్ రోజు ఆమె శారీరక సంబంధానికి నిరాకరించడంతో.. బహుశా అలిసిపోయి ఉండొచ్చునని అనుకున్నాడు. రెండో రోజు కూడా భార్య ప్రవర్తన అదే తీరులో ఉండటం తో అనుమానం వచ్చి గట్టిగా నిలదీశాడు. దీనితో అసలు విషయం బయట పడింది. తానో గే అని చెప్పింది. వరుడు ఆమెను తిరిగి వాళ్ళింటికి పంపించేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు వధువు తరపు బంధువులు వరుడి ఇంటికి వచ్చి కట్నం డబ్బు, నగలను తీసుకెళ్లారు. అయితే పెళ్లికి తాను పెట్టిన ఖర్చు ఇవ్వాలని వరుడు అడగటం.. వధువు కుటుంబీకులు అతడిపై దాడి చేశారు. దీంతో వరుడు, అతడి తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news