భార్యను చంపాడని ఆరు నెలలు జైలుశిక్ష.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

-

భార్యను చంపిన కేసులో ఓ వ్యక్తి జైలుకి వెళ్లాడు. ఆరు నెలలుగా జైలు జీవితం గడుపుతున్నాడు. కానీ ఈ కేసులో ఓ ట్విస్ట్ ఉంది. ఎవరినైతే చంపాడని అతడు జైలుకు వెళ్లాడో ఆమె తన పుట్టింట్లో క్షేమంగా బతికే ఉంది. ఈ విచత్ర ఘటన బిహార్‌లోని సీతామఢీ జిల్లా చోరౌతా పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే.. పరిగావన్ గ్రామానికి చెందిన శశి కుమార్​కు నెపాల్​కు చెందిన హీరా దేవీతో వివాహం అయింది. వీరిద్దరికి ఏడాది కుమారుడు ఉన్నాడు. 7 నెలల కిందట వరకట్న వేధింపులతో భర్త శశి కుమార్​, బావ సంజయ్​ మహతో, అత్త సుమిత్రా దేవీ నిప్పంటించి తగలబెట్టారని హీరా దేవీ తండ్రి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. శశి కుమార్​ని అరెస్టు చేశారు. శశి ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాడు.

పోలీసు విచారణ సమయంలో అసలు విషయం బయటపడింది. హీరాదేవీ చనిపోలేదని.. తన పుట్టింట్లో క్షేమంగా ఉందని తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు శశిని కోర్టులో హాజరు పరిచి, వాంగ్మూలం తీసుకున్నారు. హీరా దేవి మతిస్తిమితం బాగోలేదని ఆమె తరఫు కుటుంబసభ్యులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఆమెను శశి.. ముజఫర్‌పుర్ రైల్వే స్టేషన్​లో దిగబెట్టాడని.. తప్పిపోయిన ఆమె.. అక్కడ నుంచి వెతుక్కుంటూ నేపాల్​లోని మటిహని పోలీస్ స్టేషన్​ పరిధిలోని తన తల్లిగారింటికి చేరుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news