నిత్యం భార్య కొడుతుందని భర్త వినూతన నిరసన..!

-

సాధారణంగా ఎక్కువగా భార్యలను భర్తలు కొడుతుంటారు. కానీ ప్రస్తుతం ఎక్కువగా భర్తలనే భార్యలను కొడుతున్నారు. చాలా ప్రాంతాల్లో జరుగుతున్న వాస్తవం ఇది. తాజాగా ఓ భర్త నిరసన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఈ రోజుల్లో ఇంట్లో ఆడవాళ్ల మీద చేయిచేసుకోవాలంటేనే మగాళ్లు జంకుతున్నారు. ముఖ్యంగా  గృహ హింస, వరకట్నం కేసులు అంటూ మహిళలు సవాలక్ష కేసులు పెడుతూ.. భర్తలను తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు.

ఒకవేళ ఏకాభిప్రాయం కుదకపోతే పుల్ల విరిచినంత ఈజీగా విడాకులు తీసుకుంటూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లాల్లో అందుకు భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. తన భార్య రోజు చితకబాదుతుందంటూ ఓ భర్త బాన్సువాడ ‘పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు. మామూలు పోలీస్ స్టేషన్కు వెళితే.. లేక్కేముంటుందని అనుకున్నాడో ఏమో ఆ వ్యక్తి కేవలం చెడ్డీ ధరించి అర్ధ నగ్నంగా పోలీసుల వద్దకు వెళ్లాడు. భార్య నుంచి తనను కాపాడాలని, ప్రతిరోజూ కొడుతుందంటూ తన బాధలను చెప్పుకున్నాడు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న పోలీసులు బాధితుడికి, అతడి భార్యకు ఏదో విధంగా సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news