ప్రేమెందర్ రెడ్డికి ఓటు వేయండి.. నిలదీసే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది : ఈటల రాజేందర్

-

నల్లగొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డికి ఓటు వేయండి.. నిలదీసే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది అని మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తాజాగా హుజూర్ నగర్ లో ప్రచారం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక సిమెంట్ రోడ్డు వస్తే బాగుండు, మోరి కడితే బాగుండు, గింత పని చేస్తే బాగుండు అనుకుంటాం.  కానీ అధికారం రాకపోయినా,మనకు పని చేసే భాగ్యం కలకకపోయినా మోడీ గారు మనకి గొప్ప వరం ఇచ్చారు, ఏ ఇంటికి పోయిన కూర్చో బిడ్డా… చాయ్ తాగు బిడ్డా నీకే ఓటేస్తాం అంటున్నారు.

2006లో కరీంనగర్ లో కేసీఆర్ రాజీనామా చేశారు. అప్పుడు నేను కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిని. రెండు సంవత్సరాలు కేసీఆర్ ఎన్నడు కరీంనగర్ రాలేదు, ఎంపీ లార్డ్స్ కూడా కార్యకర్తలకు ఇవ్వలేదు. కెసిఆర్ రాజీనామాలు చేసిన తర్వాత నేను ఏ ఇంటికి పోయినా, ఏ ఊరికి పోయినా మళ్లీ మోసం చేయడానికి వచ్చావా అనే పరిస్థితులలో ఉన్నాను. 20 రోజులు తిరిగిన ఎక్కడా కూడా ప్రతికూల పరిస్థితి తప్ప అనుకూల పరిస్థితి లేదు. కానీ మెల్లగా ఏమైందో తెలియదు గానీ. కేసీఆర్ మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ కెసిఆర్ గనక ఓడిపోతే తెలంగాణ వాదం అయిపోతది, మళ్లీ ఎన్ని సంవత్సరాలకు తెలంగాణ వాదమోస్తదో అని వాళ్ళంతటకు వాళ్లే భావించుకొని ఎవరు పిలవకుండానే కరీంనగర్ కు వచ్చి వాళ్ళంతటకు వాళ్లే ప్రచారం చేశారు.

ప్రచారం అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు మీ పరిస్థితి ఏంటి అని అడిగారు. స్లిప్పులిచ్చేవారు లేరు, పోలింగ్ బూతులో కూర్చునే వారు కూడా లేరు, కానీ పోలింగ్ బూతులలో విధులు నిర్వహిస్తున్న టీచర్లు తెలంగాణ గెలవాలని చెప్పి కూర్చున్నారు వాళ్లే మా కార్యకర్తలు అని చెప్పాను. దొంగ ఓట్లు పడకుండా చూసుకోవడానికి బయట మా పోలీసులు ఉన్నారని చెప్పాను. ప్రజలెత్తుకుంటే ఎట్లా ఉంటుందో 2006లో ఆ కాలంలోనే 100 కోట్ల రూపాయల ఖర్చు పెట్టినప్పుటికి కూడా రెండు లక్షల 5 వేల మెజారిటీతో తెలంగాణ ఉద్యమాన్ని గెలిపించిన చరిత్ర కరీంనగర్ కు ఉంది. 2008లో తెలంగాణ కోసం రాజీనామా చేశాం. అప్పుడు మమ్మల్ని పట్టించుకునే వాడే లేడు. 17 సీట్లలో పోటీ చేస్తే ఏడే సీట్లు గెలిచాయి. 2010లో ఉద్యమంలో భాగంగా పిల్లలు చనిపోకుండా ఉండాలని మా పదవులకు మళ్లీ రాజీనామా చేసి పోటీ చేసాము. ఆనాడు నాలాంటోడికి ప్రజలు ఇచ్చిన మెజారిటీ 76 వేల మెజారిటీ.

ప్రజలు పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో 2008 సాక్ష్యం. ప్రజలు పట్టించుకుంటే ఎలా ఉంటుందో 2006, 2010 సాక్ష్యం. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఎలాగో గెలవరు కేసీఆర్ ఓడిపోవాలి అని చెప్పి కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించారు. ఖమ్మం, నల్గొండ లో మాకు డిపాజిట్లు రావేమో అనుకుంటున్నాం కానీ సైదిరెడ్డి నేను గెలిచిన ఆశ్చర్య పోనవసరం లేదు అంటున్నాడు. ప్రజలే వాళ్ళంతట వాళ్ళు ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు… దేశ రక్షణ, అభివృద్ధి, అంతర్గత భద్రత ఇవన్నీ మళ్లీ కావాలంటే మోడీ గారే ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. ఇది భారత ప్రజల యొక్క అంతరంగం.  అందుకే ప్రేమెందర్ రెడ్డికి ఓటు వేయండి ప్రజలకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై నిలదీసే భాద్యత బీజేపీ తీసుకుంటుంది అని హామీ ఇస్తున్నానని తెలిపారు ఈటల.

Read more RELATED
Recommended to you

Latest news