హుజురాబాద్ నియోజక వర్గంలో మంగళ వారం ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ విజయం సాధించాడు. ఈ ఎన్నికలు చివరి వరకు రసవత్తంగా నే సాగాయి. ఎవరు విజయం సాధిస్తారో అని చాలా మంది ఎదురు చూసారు. అయితే ఈ ఎన్నికల్లో నోటా కు ఎంత మంది ఓటు వేశారో తెలుసుకుందా.
ఈ ఉప ఎన్నికల్లో నోటా కు 1036 మంది మొగ్గు చూపారు. నోటా అంటే పైన ఉన్న వాటిలో ఏదీ కాదు అని అర్థం. అయితే మన దేశం లో నోటా ను మొట్ట మొదటి సారిగా 2013 లో ఛత్తీస్ ఘడ్, మిజోరం, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లలో జరిగిన ఎన్నికల్లో నోటా ను వాడారు. అలాగే 2014 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పూర్తి స్థాయిగా అన్ని రాష్ట్రాల్లో నోటా ను వాడారు. ఈ ఎన్నికల్లో దాదాపు 1.1 శాతం నోటా కు వచ్చాయి.