’రండి మా పార్టీలో చేరండి‘ మోదీకి ఆ నేత నుంచి వినూత్న ఆహ్వానం

-

ప్రధాని మోదీ జీ20, కాప్ 26 సమావేశాల కోసం ఇటలీ, యూకే పర్యటనకు ఇటీవల వెళ్లారు. అభివ్రుద్ధి, కరోనా నివారణ, నియంత్రణ, కార్భన ఉద్గారాలను తగ్గించే విషయంపై ప్రపంచ దేశాల అధినేతలతో చర్చించారు. అయితే తాజాగా కాప్ 26 సమావేశం సందర్భంగా మోదీకి విన్నూత్న ప్రతిపాదన ఎదురైంది. ’రండి మా పార్టీలో చేరండి‘ అంటూ ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి నఫ్తాలి బెన్నెట్ నుంచి ఆహ్వానం అందింది. తమ యూమినా పార్టీలో చేరాలంటూ ఆయన మోదీని ఆహ్వానించారు. ఈ ప్రతిపాదనతో రెండు దేశాల అధినేతల మధ్య నవ్వులు విరబూశాయి. ’మా దేశంలో మీకు అత్యంత జనాధరణ ఉందని‘ నఫ్తాలీ బెన్నెట్ మోదీకి తెలిపారు. దీంతో థాంక్యూ .. థాంక్యూ అంటూ మోదీ బదులిచ్చారు.

మరోవైపు జీ 20, కాప్ 26 సమావేశాలే వేదికగా పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇజ్రాయిల్, నేపాల్, యూకే ప్రధానులతో చర్చించారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. సుస్థిర అభివ్రుద్ది, కర్భన ఉద్గారాల తగ్గింపు, భూతాపాన్ని తగ్గించే అంశాలపై చర్చించారు.

Read more RELATED
Recommended to you

Latest news