హుజూరాబాద్ బైపోల్ షురూ : గ్యాస్ సిలిండర్ ఫొటోలు వైరల్

-

కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఇవాళ ఉదయం ఏడు గంటల ప్రారంభం అయిన ఈ పోలింగ్ ఇవాళ రాత్రి 7 గంటల దాకా జరుగనుంది. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. హుజురాబాద్ లో మొత్తం ఓటర్లు రెండు లక్షల 37 వేల 36 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐదు మండలాల్లో 306 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.

ఉప ఎన్నిక కు 421 కంట్రోల్ యూనిట్స్, 891 బ్యాలెట్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే సాయంత్రం ఆరు గంటల తర్వాత కోవిడ్ పేషంట్స్ కి ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు ఎన్నికల అధికారులు. అలాగే 3865 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో.. ఓటర్లు ఒక్కొక్కరుగా… పోలింగ్ కేంద్రానికి తరలివస్తున్నారు.

అయితే ఈ నేపథ్యంలోనే హుజరాబాద్ నియోజకవర్గం లో గ్యాస్ సిలిండర్ లో ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం మన దేశంలో గ్యాస్ సిలిండర్ ధర విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దాదాపు వెయ్యి రూపాయలకు చేరువలో గ్యాస్ సిలిండర్ ధర ఉంది. దీనంతటికీ కారణం బిజెపి సర్కార్. ఈ తరుణంలోనే హుజరాబాద్ నియోజకవర్గం ఓటర్లు.. వినూత్నంగా తమ నిరసనలు తెలుపుతున్నారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు.. గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి… వెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ త నెలకొన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news