రెండు రాష్ట్రా ల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక కౌంటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ లో హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ గా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే… కౌంటింగ్ ప్రాంతంలలో 144 సెక్షన్ అమలులోకి తీసుకు వచ్చారు పోలీసులు.
ఇక మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ జరుగనుంది. ఆ తర్వాత… మండలాల వారిగా కౌంటింగ్ జరుగనుంది. మొదట… హుజూరాబాద్ ఆ తర్వాత.. వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలపూర్ ఇలా వరుసగా మండలాల ఓట్ల లెక్కింపు జరుగనుంది. అయితే.. కౌంటింగ్ సెంటర్ వద్ద కాస్త ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. పాస్ ఉన్న వారినే కౌంటింగ్ సెంటర్ కు అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. దీంతో పాస్ లు తీసుకుని పోని వారు ఆందోళనకు దిగారు. ఇక అటు బద్వేల్ ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా కాసేపటి క్రితమే ప్రారంభం అయింది.