రాజకీయ పరిశీలకులతో పాటూ తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నహుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభించారు. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్టు గొడౌన్‌లోనే జరుగుతున్న లెక్కింపు ప్రక్రియ కోసం మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 22 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.లెక్కింపునకు రిటర్నింగ్ అధికారికి ప్రత్యేకంగా మరో టేబుల్ ఏర్పాటు చేశారు.
ఇక తొలి రౌండ్ నుంచి ఓట్ల లెక్కింపులో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. తొలిరౌండ్ లో టీఆరెస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 2500పైచిలుక ఓట్ల ఆధిక్యతతో నిలిచారు. రెండో రౌండ్ లో కూడా టీఆరెస్ ముందంజలో ఉంది. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 4 వేల ఓట్ల లీడింగ్ లో టీఆరెస్ ఉంది. ఐదు రౌండ్లు ముగిసే సరికి సైదిరెడ్డి ఏకంగా 11 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఉన్నారు. మొత్తం 22 రౌండ్లు కావడంతో టీఆర్ఎస్ మెజార్టీ 30 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు.