స్వయంగా చితి పేర్చుకుని, నిప్పంటించి దూకేసాడు.. ఆ త‌ర్వాత‌..

-

కర్ణాటకలోని దొడ్డబళ్లాపుర తాలూకా తిప్పూరు గ్రామంలో అజ్జప్ప (85) అనే వృద్ధుడు గ్రామ శివారులోని గొరవెహళ్ల అటవీ ప్రాంతంలో కట్టెలు పేర్చుకుని, నిప్పంటించుకున్నాడు. వృద్ధాప్యంలో కంటికిరెప్పలా చూసుకుంటాడని భావించిన అజ్జప్ప కుమారుడు సిద్ధప్ప (58), ఆరు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశాడు. అప్పటి నుంచి ఇల్లు వదిలి వెళ్లిన అజ్జప్ప దేవాలయాల్లో,పాడుబడ్డ మండపాల్లో పడుకుంటూ కాలం గడిపాడు.

 

కోడలు, మనవళ్లతో ఉన్న గొడవల కారణంగా వారితోనూ మాట్లాడలేదు. నాలుగు రోజుల క్రితం అతను అదృశ్యం కాగా, గొర్రెలకాపర్లకు చితిపై సగం కాలిన శవం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు శవం అజ్జప్పదేనని, తనంతట తానే చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news