హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో నేడు శిక్ష ఖరారు..

-

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు

హైదరాబాద్లోని  గోకుల్ చాట్, లుంబినీ పార్క్ లలో జరిగిన జంట పేలుళ్ల కేసులో ఇద్దరు దోషులకు ప్రత్యేక న్యాయస్థానం సోమవారం శిక్ష ఖరారు చేయనుంది. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానంలో సెప్టెంబర్ 4న నాంపల్లి రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి మొత్తం ఎనిమిది మంది నిందితుల్లో ఇద్దర్ని దోషులుగా తేల్చిన సంగతి తెలిసిందే. లుంబినీ పార్క్ లో ని లేజర్ షో వద్ద బాంబు పెట్టిన అనీఖ్ షఫీఖ్ సయిద్ (ఏ1), దిల్ సుఖ్ నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద బాంబు పెట్టిన మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి (ఏ2)లను దోషులుగా పరిగణించిన కోర్టు నేడు శిక్షలు ఖరారు చేయనుంది. అయితే ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు సాదిక్ ఇష్రార్ షేక్, ఫరూక్ షర్ఫుద్దీన్ తర్ఖాష్ లను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. ఇండియన్ ముజాయిద్దీన్ వ్యవస్థాపకుడు, కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్, అతడి సోదరుడు ఇక్బాల్ భత్కల్, అమీర్ రెజాఖాన్ లు పరారీలో ఉన్నారు. నేడు శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో న్యాయస్థానం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news