టిడిపికి చిత్తశుద్ధి ఉంటే పెట్రో పన్నులు తగ్గించాలి

-

లీటర్‌ పెట్రోల్‌పై రూ.4 భారం మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం

టీడీపీకి చిత్తశుద్ది ఉంటే పెట్రో పన్నులు తగ్గించి భారత్‌ బంద్‌లో పాల్గొనాలని విజయవాడ వైఎస్సార్‌సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు సవాల్‌ చేశారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెట్రోల్‌పై రాష్ట్రం విధిస్తున్న పన్నులు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లీటర్‌ పెట్రోల్‌పై చంద్రబాబు సర్కార్‌ రూ. 4 భారం మోపుతోందని పేర్కొన్నారు.

కేంద్రంలో బీజేపీతో కలిసి నాలుగేళ్లుగా ప్రజలపై పన్నుల భారాన్ని మోపి, ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి పెట్రో రేట్లు తగ్గించాలని నిరసన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తోందని ఎద్దేవా చేశారు. పెట్రో పన్నులు తగ్గించకుండా బంద్‌లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. దివంగత నేత వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రం సిలెండర్‌ ధర రూ. 50 పెంచితే..ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. కానీ చంద్రబాబు హయాంలో గ్యాస్‌ సిలెండ్ ధర రూ. 400 నుంచి రూ.850కి పెరిగిందని విమర్శించారు. చిత్తశుద్ది లేని కాంగ్రెస్‌, టీడీపీ పెట్రో ఆందోళనకు విశ్వసనీయత లేదన్నారు. పెట్రో ధరల తగ్గింపుకోసం వైస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news