శనివారం సాయంత్రం గుడిమల్కాపూర్ లోని అంకుర హాస్పిటల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలని అదుపులోకి తీసుకువస్తున్నారు. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటల వలన సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుంది. దీంతో అప్రమత్తమైన హాస్పటల్ సిబ్బంది రోగులను బయటకు తరలించేందుకు ప్రయత్నిస్తుంది. ఆరు అంతస్తుల భవనం మొత్తం మంటలతో వ్యాప్తి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. మొదట ఆరో అంతస్తులు వ్యాపించిన మంటలు క్రమేపి మొదటి అంతస్తు వరకు వ్యాపించాయి.
ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సులు ఆరు అంతస్తులో హాస్టల్ నిర్వహిస్తున్నారు. మంటలు వ్యాపించడంతో ఒకేసారి 100 మంది నర్సులు బయటకు వచ్చేశారు. ఈ క్రమంలో వారు తమ సర్టిఫికెట్లను అక్కడే వదిలి వచ్చామని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఎంతమంది రోగులు హాస్పిటల్లో ఉన్నారని విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.