రామ్ గోపాల్ వర్మ వ్యూహం మూవీకి మళ్లీ బ్రేక్..?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెలకెక్కించిన విషయం తెలిసిందే. రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ఉండడంతో ఈ చిత్రానికి అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. ముందుగా సెన్సార్ బోర్డు విడుదలకు అనుమతిని నిరాకరించింది ఆ తర్వాత కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఎలాగో అలాగా సెన్సార్ నుంచి అడ్డంకులను రాంగోపాల్ వర్మ క్లియర్ చేసుకున్నారు. విడుదలకు వారం రోజులు ఉందనగా రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది.

ఈ సినిమాను ఓటీటీ తో పాటు ఇతర ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేయడానికి నిలుపి వేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఈ చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ని రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నేతలు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణకు స్వీకరించిన కోర్టు వ్యూహం సినిమా విడుదలపై మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమాను ఓటీటీ, ఆన్లైన్, ఇంటర్నెట్ వేదికల్లో ఎక్కడ కూడా విడుదల చేయవద్దని ఆదేశించింది. మరోవైపు ఈ చిత్రాన్ని నిర్మించిన రామదూత క్రియేషన్స్ తో పాటు దర్శకుడు రాంగోపాల్ వర్మకు కోర్టు నోటీసులు జారీ చేసింది.  తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఇవాళ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు విజయవాడలో గ్రాండ్ గా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్.

Read more RELATED
Recommended to you

Latest news