మృతదేహాన్ని త‌మ‌కు అప్ప‌గించాలంటూ `దిశ` కేసులో నిందితుడు చెన్నకేశవుల భార్య‌..

-

దిశ హత్యకేసులో నిందితులైన నలుగురు యువకులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. అయితే నిందితుడు చితంకుంట చెన్నకేశవులు మృతదేహాన్ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. చెన్నకేశవులు మృతదేహాన్ని తమకు అప్పగించాలని బంధువులతో కలిసి అతడి భార్య రేణుక, తల్లి జయమ్మ రోడ్డుపై బైటాయించారు. దీంతో నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తమ పొలంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని చెన్నకేశవులు కుటుంబ సభ్యులు అంటున్నారు. చావనైనా చస్తాం కానీ సామూహిక ఖననానికి ఒప్పుకోమని చెన్నకేశవులు భార్య రేణుక, తల్లి జయమ్మ స్పష్టం చేశారు. కాగా, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత నేరుగా శ్మశానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఎంత ఆలస్యమైనా ఈరోజు అంత్యక్రియలు పూర్తి చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news