పూర్తి స్థాయి కరోనా ఆస్పత్రిగా గాంధీ…!

-

పూర్తి స్థాయి కరోనా ఆస్పత్రిగా గాంధీ ఆస్పత్రిని మార్చాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు పక్కా చర్యలు తీసుకుంటుంది. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా వ్యవహరిస్తుంది. ప్రజలకు కూడా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణాలో కరోనా రెండో దశలో ఉంది.

ఇది మూడో దశలోకి వెళ్ళకుండా ఉండేందుకు గాను తెలంగాణా ప్రభుత్వం సిద్దమైంది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే కరోనాకు ముందు నుంచి చికిత్స చేస్తున్న గాంధీ ఆస్పత్రిని పూర్తి స్థాయి కరోనా ఆస్పత్రిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఆస్పత్రులు అన్నింటిలోను ఓపీ సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది తెలంగాణా ప్రభుత్వం.

కాగా తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 44 కరోనా కేసులు తెలంగాణాలో నమోదు అయ్యాయి. వీటిలో పలు కేసులు పూర్తిగా నయం అయ్యాయి. ఎవరి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా లేదు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల సరిహద్దులను తెలంగాణా ప్రభుత్వం మూసి వేసింది. ఏపీ సరిహద్దులను కూడా పూర్తిగా నిలిపివేసింది తెలంగాణా సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news