Metro Trains: అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

-

రేవంత్ రెడ్డి పాలనలో మెట్రో రైల్ కు ఊహించని షాక్ తగిలింది. అమ్మకానికి హైదరాబాద్ మెట్రో వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో… రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత… ఫ్రీ బస్సు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫ్రీ బస్సు నేపథ్యంలో చాలామంది మహిళలు ఇందులోనే వెళుతున్నారు. దీంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు.

కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అయితే ఈ ఫ్రీ బస్సు ఎఫెక్ట్ ఎక్కువగా హైదరాబాదులో కనిపిస్తోంది. హైదరాబాద్లో ఉన్న ఆటో డ్రైవర్లు గిరాకీలు లేకపోవడంతో.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బండబూతులు తిడుతున్నారు. ఇక ఇప్పుడు దీని ఎఫెక్టు మెట్రో రైల్ పై కూడా పడింది.

ఫ్రీ బస్సు కారణంగా తీవ్రంగా నష్టపోయామని.. అసలు ప్రయాణికులు ఎవరు మెట్రో రైల్లో వెళ్లడం లేదని L& T కంపెనీ వెల్లడిస్తోంది. హైదరాబాద్ మెట్రో నుండి వైదొలగనున్న ఎల్&టీ… ఫ్రీ బస్సు పథకంతో మెట్రోలో ప్రయాణికులు తగ్గడంతో మెట్రో నుండి తప్పుకోవాలని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news