కేసీఆర్కు హిమాన్షు సర్ప్రైజ్.. వీడియో వైరల్

-

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాత తన ఫామ్హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రలు నిర్వహించి బిజీబిజీగా గడిపిన ఆయన ప్రస్తుతం సేద తీరుతున్నారు. తన కుటుంబంతో కాస్త సమయాన్ని గడుపుతున్నారు. కేసీఆర్ మనవడు, కేటీఆర్ తనయుడు హిమాన్షు గురించి అందరికీ తెలిసిందే. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన హిమాన్షు ఎన్నికల నేపథ్యంలో ఇటీవల నగరానికి వచ్చిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మొదటిసారిగా తను ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేశారు. ఇక హిమాన్షుకు తన తాతపై ఉండే మమకారాన్ని ఇప్పటికే పలు సందర్భాల్లో చూశాం.

అయితే హిమాన్షు తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో యూఎస్ నుంచి వచ్చిన తర్వాత మొదటిసారిగా హిమాన్షు కేసీఆర్ను కలిసి సర్ప్రైజ్ చేసినట్లు కనిపిస్తోంది. బస్సుయాత్రలో ఉన్న కేసీఆర్ బస్సులో కూర్చొని ఉండగా.. హాయ్ తాతా అని హిమాన్షు సడెన్గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. ఒక్కసారిగా తన మనవణ్ని చూసిన కేసీఆర్.. అరే నువ్వెప్పుడు వచ్చినవ్ రా అంటూ ఆప్యాయంగా పలకరించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

https://x.com/TheHimanshuRaoK/status/1793315101484966024

Read more RELATED
Recommended to you

Latest news