ప్రస్తుతం రెండు టాలీవుడ్ సినిమాల గురించి దేశ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. అందులో మొదటిది యంగ్‌రెబల్‌స్టార్ నటించిన సాహో. రెండోది మెగాస్టార్ చిరంజీవి సైరా. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రెండు సినిమాల్లో ముందుగా సాహో ఈ నెల 30న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాలు ఒక్క నెల గ్యాప్‌తో థియేటర్లలోకి దిగుతున్నాయి. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌ను సైతం ఆశ్చర్యపరిచేలా ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కాయి.
అయితే ఈ రెండు సినిమాల బిజినెస్ విషయంలో మాత్రం చాలా గ్యాప్ కనిపిస్తోంది. సాహో వరల్డ్ వైడ్‌గా రూ.550 కోట్ల వరకు ప్రి రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. అదే సైరా కేవలం రూ. 250 కోట్ల వరకు లాక్కువస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇక ముఖ్యంగా బాలీవుడ్ విషయానికి వస్తే సాహో హిందీ డబ్బింగ్ రైట్స్‌ను ప్రముఖ ఫిల్మ్ మేకర్స్ రూ.80 కోట్లు పెట్టుబడి పెట్టి మరీ కొనుగోలు చేశారు.
సైరా విషయంలో మాత్రం ఆ స్థాయి బిజినెస్ జరగలేదు. 50 కోట్లకు ఈ చిత్రంను అమ్మేందుకు చరణ్ ముప్పుతిప్పలు పడ్డాడు. అయినా బాలీవుడ్‌లో సైరాను ఆ రేంజ్‌లో కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. రూ.40 కోట్ల లోపు మాత్రమే సైరా అక్కడ బిజినెస్ చేసిందని… కానీ సినిమా హైప్ కోసం రూ.40 కోట్లు బిజినెస్ చేసినట్టు చెప్పుకుంటున్నారని తెలుస్తోంది.
అది కూడా అమితాబచ్చన్ వంటి బాలీవుడ్ మెగాస్టార్ నటించడంతో ఆ మాత్రం బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఒక నెల తేడాలో రిలీజ్ అవుతోన్న రెండు టాలీవుడ్ ప్రెస్టేజియస్ సినిమాలు అయిన సాహో మరియు సైరాల మధ్య వ్యత్యాసం చాలా కనిపిస్తుంది. మరి విడుదల తర్వాత కూడా ఇది అలాగే కొనసాగుతుందా ? వసూళ్లలో ఏ సినిమా సత్తా ఏంటనేది ? చూడాలి.