ప్రయాణికులు లేక ఈగలు తోలుకుంటున్న హైదరాబాద్ మెట్రో ట్రైన్

-

హైదరాబాద్ నగరంలో కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్న హైదరాబాద్ నగరవాసులు జనసాంద్రత ఎక్కువ కలిగిన ప్రదేశాలకు దూరంగా ఉంటున్నారు. ఇక హైదరాబాద్ మెట్రో ట్రైన్ల పై కూడా కరోనా ఎఫెక్ట్ బాగానే పడింది. కరోనా భయంతో హైదరాబాద్ నగర వాసులంతా కూడా సొంత వాహనాలలోనే ప్రయాణించడానికి ఆసక్తి చూపుతూ మెట్రో ట్రైన్ ప్రయాణాలకు స్వస్తి చెప్పారు. దాంతో హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రో రైల్వే స్టేషన్లన్నీ కూడా బోసిపోతున్నాయి.

సెప్టెంబరు 7వ తేదీన ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో సేవలు ఇప్పటికీ ప్రయాణికులను ఆకర్షించ లేక ఈగలు తోలుకుంటున్నాయి. కరోనాకు ముందు సుమారు మూడు లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోవడంతో ప్రతిరోజు కి 25-30 వేల మంది కంటే ఎక్కువ ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకోవడం లేదు. మెట్రో యాజమాన్యం ప్రయాణికులకు కరోనా సంక్రమించకుండా రైళ్లను శుభ్రం చేసి హ్యాండ్ శానిటైజర్లను ఇస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం తమ సొంత వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news