ఢిల్లీ అల్లర్ల ఛార్జిషీట్ లో సల్మాన్ ఖుర్షీద్ పేరు

-

ఢిల్లీ అల్ల‌ర్ల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ పేరును ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. సెప్టెంబ‌ర్ 17వ తేదీన దాఖలు చేసిన 17 వేల పేజీల ఛార్జిషీటులో స‌ల్మాన్ ఖుర్షీద్ పేరు ఉంది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు పోలీసులు ఈ ఛార్జిషీట్‌లో ఖుర్షీద్ పేరును నమోదు చేసినట్లు తెలిపారు. సీఏఏ, ఎన్నార్సీకి వ్య‌తిరేకంగా అల్ల‌ర్ల‌కు పాల్ప‌డిన ఓ వ్య‌క్తి చెప్పిన సాక్ష్యం మేర‌కు స‌ల్మాన్ ఖుర్షీద్ పేరును ఛార్జిషీటులో న‌మోదు చేసిన‌ట్లు స‌మాచారం. ఉమర్ ఖలీద్, సల్మాన్ ఖుర్షీద్, నదీమ్ ఖాన్ ఇద్దరు ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఓ వ్యక్తి చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆ సాక్షి పేరును పోలీసులు బ‌య‌ట‌పెట్ట‌డం లేదు. ఆ సాక్షి చెప్పిన వివ‌రాల‌ను మెజిస్ర్టేట్ ఎదుట న‌మోదు చేశారు.

Salman Khurshid
Salman Khurshid

ఇక ఛార్జిషీటులో పేరు న‌మోదు అయిన విష‌యంపైసల్మాన్ ఖుర్షీద్ ఘాటుగా స్పందించారు. తాను రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేయ‌లేద‌ని ఆయన వెల్లడించారు. చెత్త స‌మాచారం సేక‌రించి.. అభాసుపాలు చేయాల‌నుకుంటే మీరే మ‌లినం అవుతార‌ని ఆయన పేర్కొన్నారు. న్యాయ‌మైన మ‌ద్ద‌తు ఇచ్చేందుకే ఆ నిర‌స‌న‌ల‌కు హాజ‌ర‌య్యాన‌ని ఖుర్షీద్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news