భాగ్యనగర వాసులకు భయం పెరిగింది… ఇదిగో ప్రూఫ్!

-

తెలంగాణలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. సరాసరిన ప్రతి రోజు వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46 వేలు దాటింది. అందులో మెజారిటీ కేసులు భాగ్యనగరం నుంచే అవ్వడంతో… ఇప్పుడిప్పుడే హైదరాబాదీలకు కనువిప్పు కలిగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.. ఫలితంగా క్యూలు పెరుగుతున్నాయంట!

రోజురోజుకి హైదరాబాద్ పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో… ఏపీలో జరిగినన్ని టెస్టులు తెలంగాణలో జరిగితే.. అసలు వాస్తవాలు బయటకు వస్తాయన్న కథనాలు వారిని మరింతగా భయపెడుతున్నాయి. ఇప్పటికే నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య ఒకెత్తు అయితే… అనుమానితుల సంఖ్య కూడా దానికనుగుణంగా పెరిగిపోతుందంట. దాంతో తమకు కరోనా సోకిందేమో అని నిర్ధారించుకునేందుకు చాలా మంది ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎదుట ఉదయం 6 గంటల నుంచే క్యూలు కడుతున్న పరిస్థితికి నెలవైంది భాగ్యనగరం!

లాక్ డౌన అని ప్రకటించిన కొత్తలో.. పోలీసుల కళ్లుకప్పి బయట తిరగడాన్ని హీరోయిజంగా భావించారన్న పేరు సంపాదించుకున్న భాగ్యనగర వాసులకు… ఇప్పుడిప్పుడే కరోనా అంటే ఏమిటో, దాని ప్రభావ తీవ్రత ఎంతో తెలిసినట్లుందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో… వీరంతా ఉదయం నుంచీ మరీ క్యూల్లో ఉండటం అనేది.. సర్కార్ పనితనానికి నిదర్శనంగా కూడా చెబుతున్నారు!

కాగా… హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో మొత్తం 90 టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇవి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతున్నా… రోజు రోజుకీ పెరిగిపోతోన్న అనుమానితుల సంఖ్యను బట్టి.. ఉదయం 6 గంటల నుంచే జనం క్యూలో నిలుచుంటున్నారు. అవన్నీ ఒకెత్తు అయితే… రోజుకు కేవలం 40 మందికి మాత్రమే టెస్టులు చేసే అవకాశం వుందని వైద్య సిబ్బంది చెబుతుండటం మరొకెత్తు!!

Read more RELATED
Recommended to you

Latest news