వైరల్ అవుతున్న రజనీకాంత్ వీడియో..!

-

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణమైన తెల్లని కుర్తా పైజామా ధరించి తనదైన స్టైల్‌లో లంబోర్గిని కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా అది అభిమానుల కళ్లలో పడింది. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోని అభిమానులు సెల్‌ఫోన్‌లో బంధించారు. తన కుమార్తెకు చెందిన అంత్యంత ఖరీదైన లాంబోర్గినీ కారును రాజనీ డ్రైవ్ చేస్తూ వెళ్లారు.

ఈ సందర్బంగా ఆయన మాస్క్ కూడా ధరించారు. ప్రస్తుతం రజనీ వద్ద ప్రీమియర్‌ పద్మిని, అంబాసిడర్‌, మెర్సిడెస్‌ బెంజ్‌ జి క్లాస్‌, రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌, రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ వంటి సూపర్‌ కార్లు ఉన్నాయి. రోనా వైరస్‌ కారణంగా రజనీకాంత్‌  ఇంటికే పరితమైయ్యారు. సినిమాల విషయానికి వస్తే.. రజనీకాంత్‌ హీరోగా శివ దర్శకత్వంలో గత ఏడాది చివర్లో ఓ సినిమా ఆరంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రానికి ‘అన్నాత్తే’ అని టైటిల్‌ పెట్టినట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news