ఉద్యోగాల భర్తీపై మంత్రి ఆదిమూలం సురేష్ ప్రకటన చేశారు. త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేస్తామని…2500 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటన చేశారు. అలాగే బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. యూనివర్సిటీలో అధ్యాపకుల ఖాళీలను పూర్తి చేస్తామని.. స్టూడెంట్, టీచర్ రేషియోకు అనుగుణంగా నియామకాలు ఉంటాయన్నారు మంత్రి ఆదిమూలం సురేష్.
విశాఖ నగరంలో హాయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు రెండవ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా ప్లానింగ్ బోర్డు లేదు…మన రాష్ట్రంలోనే ఉందని తెలిపారు. విద్యాశాఖ కిందకు రాని వెటర్నరీ,అగ్రికల్చర్,మెడికల్ యూనివర్సిటీలను ఒకే గొడుగు కిందకు తెచ్చామని.. మౌలిక వసతులు,మానవవనరులు ఎక్స్చేంజి ప్లానింగ్ బోర్డు ద్వారా సాధ్యం అయిందని వివరించారు. విద్యలో నాణ్యత ప్రమాణాలు, ఉన్నత విద్య విస్త్రతం పై చర్చించామని.. విద్యకు పేదరికం అడ్డుకా రాదు….విద్యను వ్యాపారం చేయకూడదనేది ముఖ్యమంత్రి జగన్ ఆలోచన అని వెల్లడించారు.