హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, టోలిచౌకి, మణికొండ, గచ్చిబౌలి, లింగంపల్లి, అంబర్‌పేట్, రామంతాపూర్, ఉప్పల్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, బేగంపేట్, కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి, మాదాపూర్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్ ప్రకటించింది ట్రాఫిక్ సిబ్బంది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం మరియు రద్దీ సమయం/ఆఫీస్ గోయింగ్ అవర్స్ దృష్ట్యా, నీరు నిలిచిపోవడం వల్ల వివిధ చోట్ల భారీ ట్రాఫిక్ రద్దీ / జామ్‌లు ఏర్పడే అవకాశం ఉందని… ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులతోపాటు హెచ్‌టీపీ తమ వంతు కృషి చేస్తుందని పేర్కొంది పోలీస్ శాఖ.
భారీ వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని కనీసం ఒక గంట వాయిదా వేయాలని మేము కోరుతున్నాము… దీనివల్ల వర్షపు నీరు డిశ్చార్జి అవుట్‌లెట్ల ద్వారా బయటకు పోతుంది… భారీ వర్షం ముగిసినప్పుడు, దయచేసి మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి తొందరపడకండి.మీరు తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలకు గురవుతారు కాబట్టి నీటిని బయటకు వెళ్లనివ్వండని వెల్లడించింది.