హైదరాబాద్ వాతావరణం క్షణానికో రకంగా మారిపోతోంది. అప్పుడే ఎండ మండిపోతోంది.. అప్పుడే చిరుజల్లులు కురుస్తున్నాయి. మొత్తంగా నగరంలో పగలు సెగలు.. సాయంత్రం వానలు అన్న చందంగా వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఇక ఇవాళ ఉదయం నుంచి భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
నగరంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట్, జగద్గిరిగుట్ట, జేఎన్టీయూ, ప్రగతినగర్, మూసాపేట్, కుత్బుల్లాపూర్, సూరారం, జీడిమెట్ల, చింతల్, బాలానగర్, కొంపల్లి, సుచిత్ర, బోయిన్పల్లి, సికింద్రాబాద్, మాదాపూర్‌లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై నీళ్లు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మరోవైపు ఉదయం నుంచి వాన కురుస్తుండటం వల్ల పనుల మీద బయటకు వెళ్లే వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లే వారు వర్షంలో తడుస్తున్నారు. పలుచోట్ల రహదారులపై నీరు నిలవడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.