మీరు మంచి టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. కోస్టల్ కర్నాకట లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు చూడాలంటె ఈ ప్యాకేజీ బాగుంటుంది. ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. డివైన్ కర్నాటక అనే పేరుతో ఈ రైల్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటోంది. ఈ ప్యాకేజీ తో ఉడుపి, శృంగేరి, ధర్మస్థల, కుక్కి, మంగళూరు ఇవన్నీ చూసి వచ్చేయచ్చు. ఇక ఈ ప్యాకేజీ కి సంబంధించి పూర్తి వివరాలు చూసేద్దాం. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ మంగళవారం ఇది అందుబాటులో ఉంటుంది.
ఐఆర్‌సీటీసీ డివైన్ కర్నాటక టూర్ ప్యాకేజీ మొదటి రోజు హైదరాబాద్‌లో మొదలు అవుతుంది. పర్యాటకులు ఉదయం 6.05 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కితే రెండో రోజు ఉదయం 9.30 గంటలకు మంగళూరు రీచ్ అవుతారు. ఆ తరవాత ఉడుపి బయల్దేరాలి. సెయింట్ మేరీస్ ఐల్యాండ్, మాల్పే బీచ్ చూసి రావచ్చు. రాత్రికి ఉడుపిలో ఉండాలి. మూడో రోజు ఉడుపిలో శ్రీకృష్ణ ఆలయాన్ని చూసి.
ఆ తర్వాత శృంగేరి వెళ్ళాలి. శారదాంబ ఆలయాన్ని కూడా చూసి. ఆ తర్వాత మంగళూరు వెళ్ళాలి. రాత్రికి మంగళూరులో ఉండాలి. నాలుగో రోజు ఉదయం ధర్మస్థలలో మంజునాథ స్వామి ఆలయాన్ని చూసి కుక్కి సుబ్రమణ్య స్వామి వారి ఆలయానికి బయల్దేరాలి. ఆ తరవాత రాత్రికి మంగళూరులో ఉండాలి. ఐదో రోజు మంగళూరు లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది.
పిలికుల నిసర్గధామ, మంగళదేవి ఆలయం, కటీల్ ఆలయం, తన్నీర్‌బావి బీచ్ ఇవన్నీ కూడా ఈ ప్యాకేజీ లో చూడవచ్చు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం. రాత్రి 9 గంటలకు మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కితే మరుసటి రోజు రాత్రి 8.05 గంటలకు కాచిగూడ చేరుతారు. ఇక ధర విషయానికి వస్తే.. కంఫర్ట్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.15,420, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.17,160 చెల్లించాలి.
స్టాండర్డ్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.12,420, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.14,160 చెల్లించాలి. అదే ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకునేవారికి అయితే.. కంఫర్ట్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.16,320, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.19,820, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.33,170 పే చెయ్యాలి. స్టాండర్డ్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.13,320, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.16,820, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.30,170 చెల్లించాలి.