ప్రతి భార్యా ప్రతి భర్త ఆనందంగా కలిసి వారి భాగస్వామితో ఉండాలని కోరుకుంటుంటారు. ఆచార్య చాణక్య లైఫ్ లో ఎదురు అయ్యే ప్రతి సమస్య గురించి కూడా ఎంతో చక్కగా వివరించారు. చాణక్య చెప్పినట్లు జీవితంలో మనం పాటిస్తే ఖచ్చితంగా ఎలాంటి బాధ లేకుండా హాయిగా జీవించొచ్చు. స్నేహితులు మధ్య వచ్చే సమస్యలు, విజయానికి మార్గాలు, వైవాహిక జీవితంలో కలిగే సమస్యలు ఇలా చాలా అంశాల గురించి చాణక్య చెప్పుకొచ్చారు.
చాణక్య నీతి ద్వారా ఆచార చాణక్య కొన్ని విషయాలని చెప్పారు. వైవాహిక జీవితంలో కచ్చితంగా వీటిని పాటించాలని చాణక్య అన్నారు. స్త్రీ ఉదయం లేచిన తర్వాత భర్తతో కలిసి కొన్ని పనులు చేస్తే మంచిదని వారి సంబంధం చాలా దృఢంగా బలంగా ఉంటుందని చాణక్య అన్నారు. వీటిని కచ్చితంగా స్త్రీ పాటిస్తే జీవితంలోకి అదృష్టం శ్రేయస్సు వస్తుందని చాణక్య అన్నారు. భార్యాభర్తలు ఉదయం పూట యోగా చేస్తే ఆరోగ్యనికి చాలా మంచిది. ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. దంపతుల మధ్య గొడవలు రావు. మీ రోజుని చక్కగా ప్రారంభించినట్లు అవుతుంది.
ప్రేమతో భార్యాభర్తలు రోజుని ప్రారంభిస్తే ఉల్లాసంగా జీవించడానికి అవుతుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. భగవంతుని ఆశీర్వాదంతో రోజున మొదలు పెడితే రోజంతా హాయిగా ఉండొచ్చు.
పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి తులసి మొక్కకి నీళ్లు పోస్తే జీవితాంతం సామరస్యంగా జీవించవచ్చు. వైవాహిక జీవితంలో సమస్యలు కలగవు. కలకాలం కలిసి ఆనందంగా జీవించడానికి అవుతుంది.