రామ్ గోపాల్ వర్మ , అషు రెడ్డి లపై సెటైరికల్ పంచ్ వేసిన హైపర్ ఆది..!

-

జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా తన జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టి తనదైన కామెడీ స్టైల్ తో కౌంటర్ పంచులతో ఒక వర్గం అభిమానులను సంపాదించుకున్నాడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా స్కిట్లు చేస్తూ ఒక కంటెస్టెంట్ గా పరిచయమైన ఈయన.. ఇప్పుడు డైలాగ్స్, స్కిట్స్ రాసే రేంజ్ కి ఎదిగిపోయాడు. ముఖ్యంగా హైపర్ ఆది అంటే ఇప్పుడు తెలియని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఉండరు. అప్పుడప్పుడు ఈయన చేసే వ్యాఖ్యల వల్ల ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాడు. ముఖ్యంగా సినీ యాక్టర్స్ ను ఇమిటేట్ చేస్తూ ఎంతో ఎంటర్టైన్ చేసే హైపర్ ఆది.. ఇప్పుడు తాజాగా సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇమినేట్ చేస్తూ తన కామెడీ కోసం తెగ వాడేసాడు.

హైపర్ ఆది తన కామెడీ డైలాగ్స్ పంచులను బుల్లితెరపైనే కాకుండా సినిమాల్లోకి కూడా ఉపయోగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అల్లరి నరేష్ నటించిన మేడ మీద అబ్బాయి సినిమాకి డైలాగ్ రైటర్ గా మారాడు. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ధమాకాకి కూడా కొన్ని కామెడీ సీన్స్ రాశారు హైపర్ ఆది. ఇదిలా ఉండగా హైపర్ ఆది స్కిట్స్ , స్పూఫ్ వీడియోలకు పెట్టింది పేరు. ఇటీవల సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి ఇంటర్వ్యూ ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే.

ఇంటర్వ్యూ పై స్కూఫ్ స్కిట్ చేసి అందరిని నవ్వించాడు హైపర్ ఆది. అంతే కాకుండా స్కిట్ తో ప్రేక్షకులను నవ్వించడమే కాదు డైరెక్టర్ ఆర్జీవికి, అషు రెడ్డికి పరోక్షంగా సెటైరికల్ పంచులు వేశారు అని నెటిజెన్స్ భావిస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ పై ఆర్జీవి చేసే ట్వీట్స్ కు కౌంటర్ ఎటాక్ చేశాడు అని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి నెట్టింట వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news