ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. చాలా కామన్ గా షుగర్ అందరికీ వస్తోంది. ఈ సమస్య నుండి బయటపడడానికి ఈ ఆకు రసాలు బాగా ఉపయోగపడతాయి. పైగా టైప్ టు డయాబెటిస్ తో బాధపడే వారిలో గుండె సమస్యలు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటివి వచ్చే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా షుగర్ సమస్య ఉన్న వాళ్ళు ఆహారాన్ని చూసుకుని తినాలి.
వ్యాయామం చేయడం, బరువుని కంట్రోల్ లో ఉంచుకోవడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి డయాబెటిస్ నుండి దూరంగా ఉండడానికి ఈ ఆకు రసాలు బాగా ఉపయోగపడతాయి. మరి వాటి కోసమే ఇప్పుడు చూద్దాం.
జామ ఆకు రసం:
జామ ఆకు రసం తీసుకుంటే గ్లూకోస్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. జామ ఆకు రసం తీసుకోవడం వలన ఇతర కార్బోహైడ్రేట్లను గ్లూకోస్ గా విచ్చిన్నం చేస్తుంది జామ ఆకు రసం. ఇది ఒక ఎంజైమ్.
మామిడి ఆకు రసం:
మామిడి ఆకు రసం కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది ఇన్సులిన్ ని పెంచి గ్లూకోస్ ని నియంత్రిస్తుంది. ఇలా ఇంత శక్తి ఉంది కాబట్టి మామిడి ఆకు రసాన్ని కూడా మీరు తీసుకోవచ్చు.
తులసి ఆకు రసం:
తులసి ఆకు ని ఆయుర్వేద వైద్యంలో కూడా వాడుతూ ఉంటారు తులసి ఆకు రసాన్ని తీసుకోవడం వలన కూడా డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. తులసి ఆకుల్లో హైపోగాజమిక్ లక్షణాలు ఉంటాయి. ఇది రక్తం లో చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది.
కరివేపాకు ఆకు రసం:
కరివేపాకు ఆకు రసాన్ని తీసుకుంటే ఇన్సులిన్ ని పెంచడానికి అవుతుంది. చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది కూడా. కరివేపాకులో ఫైబర్ అధికంగా ఉంటుంది అలానే యాంటీ కార్సినోజెనిక్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు, యాంటీ డయాబెటిక్ గుణాలు కూడా ఇందులో ఉంటాయి ఇలా డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు ఈ ఆకుల రసాన్ని తీసుకోవడం మంచిదే. దానితో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది ఏ ఇబ్బంది రాదు.