భారతదేశంలో ఉన్న మహిళలు ఈ రోజు సముచితమైన గౌరవం దక్కినట్లుగా చాలా రాజకీయ పార్టీలు మరియు సీనియర్ రాజకీయ నాయకులు భావిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే.. దేశంలోకి మహిళల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఈ బిల్లు గురించి తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు… ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ … ఒక భారత పౌరుడిగా మహిళా బిల్లు రావడం తో చాలా గర్వంగా ఉందంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు. దేశానికి ఉపయోగపడే ఎటువంటి అంశాల విషయంలో అయినా ఖచ్చితంగా రాజకీయ లను పక్కనపెట్టి ఆలోచించాలంటూ చాలా మంచి మాటను కేటీఆర్ చెప్పడం సంతోషకరం. అంతే కాకుండా కేటీఆర్ కేంద్రానికి మరియు ఈ బిల్లుకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేశారు.
ఈ మహిళా బిల్లును కేసీఆర్ గారి నాయకత్వంలో ఎటువని బేషజాలు లేకుండా సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి కృషి చేస్తామన్నారు కేటీఆర్. ఇక గతంలో స్థానిక ఎన్నికల సమయంలో 50 శాతం రిజర్వేషన్ లు ఇచ్చిన అంశాన్ని గుర్తు చేశారు కేటీఆర్.