తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలియుగ పాండవులు చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు హీరో వెంకటేష్. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి ఎక్కువగా సక్సెస్ రేటు ఉన్న హీరో గా పేరు పొందారు. ఇప్పటికీ వెంకీ తన సినిమాల ద్వారా ప్రశంసలు అందుకుంటూనే ఉన్నారు. ఎక్కువ నంది అవార్డులు అందుకున్న హీరోగా కూడా వెంకటేష్ సరికొత్త రికార్డును సృష్టించారు. తన సినీ కెరీర్లో సక్సెస్లు ఎక్కువగానే కాకుండా ఏదైనా మల్టీస్టారర్ మూవీలో నటించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు వెంకటేష్. రామానాయుడు వారసులుగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్.. పై చదువులు అమెరికాలో చదివి ఇండియాకి వచ్చిన తనదైన శైలిలో ప్రేక్షకులను బాగా అలరించారు.నిర్మాత తనయుడుగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు వెంకటేష్. అయితే వెంకటేష్ ముందుగా హీరో అవ్వాలని ఏనాడు అనుకోలేదట. కేవలం ఒక బిజినెస్ మేన్ కావాలని అనుకున్నాడు. అయితే రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన కలియుగ పాండవులు చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించాడు. 35 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈయనకు ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.
అంతేకాకుండా ఈయన తన కుటుంబం కోసం నిర్మించుకున్న ఇంటిని చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఇంద్ర భవనం ను తలపించేలా తన ఇంటిని నిర్మించుకున్నాడు వెంకటేష్. ఇక తన అన్నయ్య సురేష్ బాబు సలహామేరకు బిజినెస్, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టి వెంకటేష్ బాగానే సంపాదించారు ప్రస్తుతం ఈయన ఆస్తి విలువ దాదాపుగా రూ. 2,500 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. దీనిపై అధికారుల లెక్కలు లేకపోయినా కూడా అంచనా మాత్రం అటు ఇటు గా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా తన తండ్రి నుంచి ఇంతకు మించిన ఆస్తి ఉంటుందని సమాచారం. మొత్తం అంతా కలపగా సుమారుగా రూ.6.5 వేల కోట్ల ఆస్తికి పైగా ఉన్నట్లు సమాచారం.