అలాంటి హీరోయిన్స్ నాకు అసలు నచ్చరు అంటూ.. రష్మికకు గట్టి కౌంటర్ ఇచ్చేసిన రిషబ్ శెట్టి.. !

Entertainment కాంతారా సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు రిషభ్ శెట్టి ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే అయితే తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాలి..

 

కాంతారావు రిషబ్ శెట్టి తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఓ విలేఖరి మీ సినిమాలో హీరోయిన్ గా వీరుల ఎవరు నేర్చుకుంటారు అంటూ.. రష్మిక, కీర్తి సురేష్, సాయి పల్లవి, సమంత పేర్లు అడిగారు.. అయితే దీనికి సమాధానంగా తాను స్క్రిప్ట్ పూర్తయ్యాకనే నటీనటులను ఎంచుకుంటానని, కొత్త వారికి అవకాశం ఇవ్వటానికి ఎక్కువగా ప్రయత్నిస్తానని అన్నారు.. ఆ తర్వాత గాల్లో రెండు చేతులతో కొటేషన్ సింబల్ చూపిస్తూ ఇలాంటి హీరోయిన్లు తనకు నచ్చరని, కానీ సాయిపల్లవి, సమంతలతో కలిసి పనిచేస్తానని తెలిపారు.

ప్రస్తుతం రిషబ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆయన ఈ కౌంటర్ ను హీరోయిన్ రష్మిక వేశారని అభిప్రాయపడుతున్నారు.. కాగా ఇటీవల రష్మిక ఒక ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా ‘కిరిక్ పార్టీ’ అవకాశం రావడం వెనకున్న కథ చెప్పారు. ఒక అందాల పోటీలో తాను గెలిచానని, ఆ సమయంలో తన ఫొటో ఒక ప్రముఖ దినపత్రిక మొదటి పేజీలో వచ్చిందని, దాంతో తనకు ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చిందని తెలిపారు. ప్రొడక్షన్ హౌస్ గురించి తెలిపే సమయంలో రష్మిక రెండు చేతులతో గాల్లో కొటేషన్ సింబల్ చూపిస్తూ మాట్లాడటంతో అది బాగా వైరల్ అయింది. ఈ’కిరిక్ పార్టీ’ సినిమాకు రిషబ్ శెట్టినే దర్శకుడు. సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టినే ఆ సినిమాను నిర్మించారు. అయితే ఆ రోజు రష్మిక చేసిన వ్యాఖ్యలకు రిషబ్ శెట్టి గట్టిగా కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.