నా లైఫ్‌లో రిలేషన్ షిప్స్ చాలానే ఉన్నాయి : నటి రెజీనా

-

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గతంలో ఒక వెలుగువెలిగిన హీరోయిన్ రెజీనా కసాండ్రా ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. కోలివుడ్‌లో ఆడపాదడపా సినిమాలు చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె నటించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడంతో అవకాశాలు కూడా తగ్గినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ..తన సినీ కెరీర్‌లో ఉన్న రిలేషన్ షిప్స్ గురించి ఓపెన్ అయ్యింది.

తన జీవితంలో చాలా రిలేషన్ షిప్స్ ఉన్నాయని పేర్కొన్న రెజీనా.. తాను ఒక సీరియల్ డేటర్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి మాత్రం కాస్త బ్రేక్ తీసుకున్నానని తెలిపింది.తన తాజా మూవీ ‘ఉత్సవం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె పై వ్యాఖ్యలు చేసింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రిలేషన్స్ షిప్స్ గురించి ఆమెకు ప్రశ్న ఎదురవ్వగా.. ఆమె ఇచ్చిన సమాధానాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం రెజీనా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, గతంలో సందీప్ కిషన్‌తో రెజీనా డేటింగ్ లో ఉన్నట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news