నా కెరియర్ లో ఆ 2 సినిమాలు 50 సార్లకి పైగా చూసా.. రామ్ చరణ్..!

-

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అనే బ్రాండ్తో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నారు. హాలీవుడ్ మీడియా కూడా ఇప్పుడు ఆయనను ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ పాట ఆస్కార్ కి నామినేట్ కావడంతో రామ్ చరణ్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, ప్రపంచ స్థాయి పాపులారిటీ ఉన్న యూట్యూబర్స్ రామ్ చరణ్తో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేస్తున్నారు. తాజాగా లెటర్ బాక్స్డ్ అనే యూట్యూబ్ ఛానల్ కి రామ్ చరణ్ లైవ్ ఇంటర్వ్యూ ఇవ్వగా.. అందులో తనకు ఇష్టమైన టాప్ హాలీవుడ్ సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు.

ఆయన మాట్లాడుతూ.. గతంలో ఒక ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ స్టార్స్ జూలియా రాబర్ట్ ,క్యాథరిన్ జేట జోన్స్ అని రామ్ చరణ్ చెప్పాడు. ఇప్పుడు తన ఫేవరెట్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ఆ సినిమాలు ఎన్నిసార్లు చూశారో కూడా తెలిపారు.. రామ్ చరణ్ తన ఫేవరెట్ సినిమాలపై మాట్లాడుతూ.. ఫస్ట్ ప్లేస్ లో “ది నోట్ బుక్ ,టెర్మినేటర్ 2” మొదటి రెండు స్థానాలలో ఉంటాయని తెలిపారు. అవి డిస్క్ లో ఉన్నప్పుడు ఒక్కో సినిమా 50 సార్ల కంటే పైగానే చూశాను . అందులో ప్రతి సీను కూడా ఏదో విధంగా అట్రాక్ట్ చేస్తుంది.. ఎమోషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అని తెలిపారు రామ్ చరణ్.

ఆ తర్వాత గ్లాడియేటర్ డైరెక్టర్ టరంటినో సినిమాలన్నీ కూడా తనకు బాగా నచ్చే సినిమాలని రామ్ చరణ్ తెలిపారు. అయితే ఈ రెండు సినిమాలు ఎన్నిసార్లు చూశానో గుర్తులేదు కానీ ఎన్నిసార్లు చూసినా సరికొత్త ఫీల్ కలుగుతుంది అని తెలిపారు. అలాగే దానవీరశూరకర్ణ, బాహుబలి సినిమాలతో పాటు తాను నటించిన రంగస్థలం సినిమా తన ఫేవరెట్ సినిమాలని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news