ప్రభుత్వ ఉద్యోగిగా, కలెక్టర్‌గా ప్రజలకు నిజాయతీగా సేవలు అందించాను : ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి

-

కొన్ని పత్రికల్లో తనపై వస్తున్న వార్తలపై మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి స్పందించారు.నన్ను రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేక మీడియాకు లీకులు ఇచ్చి, తప్పుడు వార్తలు రాయించి లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నిస్తున్న తీరు సిగ్గు చేటు అని మండిపడ్డారు.గత ఎన్నికల్లో పోటీ కూడా చేయని నన్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు కథలు అల్లి ప్రచారం చేయడం బట్ట కాల్చి మీద వేయడమే అని ఆరోపించారు . ఓటమి తప్పదని గ్రహించి రెండు పార్టీలు చేతులు కలిపి నన్ను ఓడించాలని దుష్ట పన్నాగం పన్నుతున్నాయి.

సిద్ధాంతాలు, విలువలు గాలికి వదిలి ప్రజల్ని మభ్యపెట్టే స్థాయికి దిగజారాయి అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగిగా, కలెక్టర్‌గా ప్రజలకు నిజాయతీగా సేవలు అందించాను. ప్రజా సేవకుడిగా ఇంకా ఎక్కువ సేవలు అందించడానికి ప్రత్యక్ష రాజకీయంలోకి వచ్చాను అని తెలిపారు. పేద విద్యార్థులకు విద్య అందించేందుకు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు ప్రకటించాను. ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ నిర్మించి సేవలు అందిస్తా అని మాట ఇచ్చాను అని అన్నారు.నేను ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదు. నీచ రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. ఈ విషయం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలందరికీ తెలిసిందే అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news