నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడతా… కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకోవడం మంచిది : కొండా సురేఖ

-

ఫోన్ ట్యాపింగ్ కేసు స్టేట్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల నేతల నడుమ మాటల యుద్ధానికి దారి తీస్తోంది.ఈ క్రమంలోనే తెలంగాణ భవన్‌లో ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు అనవసరంగా తీస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో లీగల్ నోటీసులు పంపిస్తానన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు.

‘నాకైతే ఏ నోటీసులూ రాలేదు. మనది ప్రజాస్వామ్య దేశం. మాట్లాడే హక్కు ఉంది అని అన్నారు. ఆయన చెప్పినదానికి నేను కౌంటర్ మాట్లాడా. అది ఆయనకు బాధ కలిగిస్తే ఏం చేస్తాడో చేసుకోనివ్వండి అని తర్వాత మేమేం చేయాలో అది చేస్తాం. నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడతా. కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకోవడం మంచిది అని చెప్పా అంతే’ అని ఆమె వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news