Telangana : రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతులు

-

తెలంగాణలో 9 మంది ఐఏఎస్‌ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ సంయుక్త డైరెక్టర్‌ జనరల్‌ అనితా రాజేంద్రలకు ముఖ్యకార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సుల్తానియా ముఖ్యకార్యదర్శి హోదాలో అదే శాఖలో విధులు నిర్వర్తించాలని, అనితా రాజేంద్ర ఎంసీహెచ్‌ఆర్డీలో అదనపు డైరెక్టర్‌ జనరల్‌ హోదాతో కొనసాగాలని ఆదేశించింది. మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌, సందీప్‌కుమార్‌ ఝా, సిక్తా పట్నాయక్‌, ముషారఫ్‌ అలీ ఫరూఖీ, కృష్ణ ఆదిత్య, వీపీ గౌతం, కె.స్వర్ణలతలకు సంయుక్త కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టుల్లోనే వీరు కొనసాగాలని సూచించింది. త్వరలో మరికొందరికి పదోన్నతులు లభించే అవకాశం ఉంది.

మరోవైపు రాష్ట్రంలో భారీగా ఐపీఎస్​ల బదిలీలు జరిగాయి. ఇటీవలే పరిమిత సంఖ్యలో ఉన్నతాధికారులకు స్థానచలనం కలిగించిన ప్రభుత్వం.. తాజాగా భారీస్థాయిలో మార్పులు చేసింది. సుదీర్ఘకాలం ఒకే స్థానంలో కొనసాగుతున్న పలువురు సీనియర్‌ అధికారుల్ని బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news