నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్ 1 (ప్రొబెషనరీ ఆఫీసర్), మల్టీపర్పస్ (క్లర్క్), ఆఫీసర్ స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 3 పోస్టుల భర్తీ చేస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
అభ్యర్థులు https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. అప్లై చేసే ముందు విద్యార్హతల వివరాలు వంటివి చూసి అప్పుడు అప్లై చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ బ్యాంకుల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 జూన్ 28 ఆఖరు తేదీ.
సీఏ, ఎంబీఏ, డిగ్రీ పాస్ అయిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయచ్చు. జూన్ 28 లోగా అప్లై చేయాలి గమనించండి. ఇది ఇలా ఉంటే ప్రిలిమినరీ పరీక్ష ఆగస్ట్‌లో, మెయిన్స్, సింగిల్ ఎగ్జామ్ 2021 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఉంటాయి. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి.
ఇక ఎలా అప్లై చెయ్యాలి అనేది చూస్తే.. ముందుగా https://www.ibps.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Click here to View Advertisement for CRP RRBs X పైన క్లిక్ చెయ్యండి. ఇప్పుడు మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అభ్యర్థులు Apply online for CRP RRBs X లింక్ పైన క్లిక్ చేయాలి.
ఇప్పుడు మరో న్యూ పేజ్ వస్తుంది. అందులో ఆఫీసర్ స్కేల్ 1 (ప్రొబెషనరీ ఆఫీసర్), మల్టీపర్పస్ (క్లర్క్), ఆఫీసర్ స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 3 పోస్టులకు వేర్వేరు లింక్స్ ఉంటాయి. మీరు అప్లై చేసే పోస్ట్ లింక్ మీద క్లిక్ చేసి అక్కడ Click Here for New Registration పైన క్లిక్ చేయాలి.
వివరాలని అన్ని ఫిల్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి. ఆ తరువాత ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత విద్యార్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోండి.