గుడ్ న్యూస్ : ఇక ఒలంపిక్స్ లోనూ క్రికెట్..

-

మన దేశంలో క్రీడలకు లేని క్రేజ్ క్రికెట్ కు మాత్రమే ఉంది. క్రికెట్ మ్యాచ్ వస్తే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ టీవీలకు అతుక్కుపోతారు. ఇక ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలు ప్రారంభం అయితే… క్రికెట్ ఫాన్స్ కు పండగే. ఈ నేపథ్యంలో తాజాగా క్రికెట్ ఫ్యాన్స్ కు ఐసీసీ తీపి కబురు చెప్పింది. ఒలంపిక్స్ క్రీడల్లోనూ క్రికెట్ ను చేర్చాలని తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతిపాదనలు పంపింది.

దీనికోసం ప్రత్యేకంగా బిడ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 2028 సంవత్సరంలో లాస్ ఏంజెల్స్ లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ మ్యాచ్ లు ఉండేలా చర్యలు తీసుకుంటామని ఐసీసీ ప్రకటించేసింది. ప్రపంచవ్యాప్తంగా 100 శాతం క్రికెట్ మ్యాచ్లకు అభిమానులు ఉన్నారని పేర్కొన్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్…. ఒలంపిక్స్లో ఎలాగైనా క్రికెట్ ను అమలు చేయాలని పేర్కొంది. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్న క్రికెట్ ను ఒలంపిక్స్ లో చేర్చితే…. చాలా అద్భుతంగా ఉంటుందని స్పష్టం చేసింది ఐసీసీ.

Read more RELATED
Recommended to you

Latest news